హైదరాబాద్ టూ గోరఖ్ పూర్ మధ్య ఇండిగో సేవలు
వచ్చే నెల కొత్తగా మూడు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. హైదరాబాద్-గోరఖ్‌ఫూర్, చెన్నై-రాయ్‌పూర్, కోల్‌కతా- గోరఖ్‌పూర్‌ల మధ్య ఈ సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇందులో హైదరాబాద్-గోరఖ్‌పూర్ మధ్య విమాన సర్వీస్ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఉదయం 9:55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:05 గంటలకు గోరఖ్‌ఫూర్ చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 12:35 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి టేకాఫ్ తీసుకొని 2:10 గంటలకు హూదరాబాద్లో ల్యాండ్ అవుతుందని ఇండిగో వెల్లడించింది. అంతేకాదు, వచ్చే నెల నుంచి చెన్నై-తిరువనంతపురంతో పాటు బెంగళూరు నుంచి మంగళూరు, ఉదయ్‌పూర్, చెన్నై నగరాలకు మరిన్ని సర్వీసులు నడపనున్నట్లు కంపెనీ పేర్కొంది.













