డీఎస్పీగా భారత ఉమెన్ వికెట్ కీపర్
ఉమెన్స్ వన్డే వారల్డ్ కప్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న భారత మహిళా క్రికెటర్లకు ఊహించని రీతిలో ప్రోత్సాహక బహుమతులు అందుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ మహిళల జట్టులో ఒక్కోక్కరికి రూ.50 లక్షలు అందించగా.. రైల్వే శాఖ తమ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ కొంత నగదు బహుమతి కూడా ఇచ్చింది. ఇక వారి సొంత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నజరానలు ప్రకటించాయి.
హిమచాల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర భద్ర సింగ్ ఆ రాష్ట్ర ఉమెన్ క్రికెటర్ భారత వికెట్ కీపర్ సుష్మావర్మకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు డీఎస్సీ ఉద్యోగం ఇస్తానని అప్పట్లో ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం (ఆగస్టు8) సీఎం ఆమెకు రూ.5 లక్షల చెక్కుతో పాటు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు. సుష్మాను ప్రశింసిస్తూ ఈ విషయాన్ని సీఎం అధికారిక ట్వీటర్ అకౌంట్లో పోస్టు చేశారు.













