కరోనాపై పర్యవేక్షణకు హిమాచల్‌లో మొబైల్ యాప్
కరోనా వైరస్ కారణంగా హోంక్వారెంటైన్లో ఉన్న వారిని గుర్తించడంతోపాటు, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభత్వం ఒక యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌కు కరోనా ముక్త్ హిమాచల్ అని పేరు పెట్టింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ యాప్‌ను తయారు చేయించింది. ఆరోగ్య శాఖలో పనిచేసే హెల్త్ వర్కర్లు ఈ యాప్ ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. ముఖ్యంగా హోంక్వారెంటైన్లో ఉన్నవారి హెల్త్ కండిషన్‌ను పర్యవేక్షించనున్నారు.
గ్రామాల్లోని హెల్త్ వర్కర్లు ఇచ్చే ఓటీపీ సాయంతో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని హిమాచల్ ప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ వెల్లడించింది. కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు 1779 మంది హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. ఒక వ్యక్తి కరోనా సోకి మరణించాడు. మొత్తం 211 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 208 మందికి నెగెటివ్‌గా తేలింది. మరో మూడు పాజిటివ్ కేసులు ఉన్నాయి.













