మధ్యప్రదేశ్ లో హిల్లరీ క్లింటన్ పర్యటన
అమెరికా మాజీ ఫస్ట్ లేడీ హిల్లరీ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఆమె మూడు రోజుల పర్యటన కోసం మధ్యప్రదేశ్ వచ్చారు. అక్కడ మాండవ్ జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. ఇవాళ ధార్‌లోని జహాజ్ మహాల్‌ను ఆమె సందర్శించారు. ప్రైవేటు విమానంలో హిల్లరీ ఇండోర్‌కు చేరుకున్నారు. ఖర్గోస్ జిల్లాలో ఉన్న మహేశ్వర్‌లో ఆమె బస చేశారు. మరాఠాలకు చెందిన హోల్కర్ రాజులు పాలించిన ప్రాంతంలో హిల్లరీ టూర్ చేస్తున్నట్లు సమాచారం. నర్మాద నదిలో హిల్లరీ బోటింగ్‌కు కూడా వెళ్లనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహేశ్వరీ చీరల మ్యూజియంను ఆమె విజిట్ చేయనున్నారు. అహల్యా ఫోర్ట్ హోటల్లో ఆమె ఇవాళ బస చేస్తారు. మండూలో మొఘల్ రాజులకు చెందిన కట్టడాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా ఆమె విజిట్ చేయనున్నారు. రిచర్డ్ హోల్కర్ పంపిన ఆహ్వానం మేరకు హిల్లరీ మధ్యప్రదేశ్‌కు టూర్‌కు వచ్చారు.













