హీరో ప్రపంచ రికార్డు
దేశంలో అతిపెద్ద టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2018 ఆర్థిక సంవత్సరంలో 75 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ప్రపంచం మొత్తం మీద ఈ ఘనత సాధించి తొలి సంస్థ ఇదే. 2017 ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్ 66.6 లక్షల బైక్లను విక్రయించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడు రోజుల వ్యవధి ఉండగా మార్చి 28వ తేదీన తాము ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పామని కంపెనీ చీఫ్ పవన్ ముంజాల్ ప్రకటించారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా కోటి టూవీలర్ల విక్రయ సంస్థగా అవతరించాలన్న తమ ఆకాంక్షను సాకారం చేసుకునే దిశగా తాము సరైన బాటలోనే పురోగమిస్తున్నామనేందుకు ఇది సంకేతమని ఆయన అన్నారు.













