హెరిటేజ్ పుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డు
ప్రముఖ హెరిటేజ్ పుడ్స్ వరుసాగా రెండవసారి గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకుంది. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అవార్డులకు సంబంధించి గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటేజ్ సంస్థ అందుకుంది. ఈ అవార్డులను లండన్లో నిర్వహించిన మే ఫెయిర్లో అందజేశారు. కాగా ఈ అవార్డును హెరిటేజ్ పుడ్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ భువనేశ్వరి అందుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ మరోమారు హెరిటేజ్ ఫ్యామిలీ ఈ గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. మా సంస్థ నిర్వహించే క్రమబద్దమైన పనితీరు, సిబ్బంది అంకితభావం, సంస్థ గత రవాణా విధానం మొదలైనవన్నీ అత్యుత్తమంగా నిలిచినందుకే ఈ అవార్డుకు అర్హత సాధించామని పేర్కొన్నారు.













