మధుర నుంచే పోటీ చేస్తా – హేమమాలిని
ఉత్తరప్రదేశ్‌లోని మధుర పార్లమెంటు స్థానం నుంచి ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రముఖ బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు హేమామాలిని తెలిపారు. ఈ మేరకు తనకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు. మధుర లోక్‌సభ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో హేమమాలిని పోటీ చేసి గెలిచారు. నటి నుంచి రాజకీయ రంగంలోకి దిగిన ఆమె గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన సొంత నియోజకవర్గ కేంద్రంలోని మధుర రైల్వే స్టేషన్ జంక్షన్ రూపురేఖలను అమాంతం మార్చేశారు. ‘రైల్వే అధికారులు మధుర స్టేషన్ అభివ ద్ధికి ఎంతో క షి చేశారు’ అని హేమమాలిని మంగళవారం ఇక్కడ పలు ప్రాజెక్టులను ప్రారంభించిన సందఠంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ సందఠంగా ఆమె మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తాను మళ్లీ ఇదే స్థానం నుంచి పోటీ చేస్తానని, ఇందుకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని తూర్పు ప్రాంత యాత్రీకుల మేలు కోసం మధుర నుంచి లక్నోకు రైలు సర్వీసును ప్రవేశపెట్టాలని ఆమె కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. 20 కోట్ల రూపాయలతో అభివ ద్ధి చేసిన మధుర రైల్వే స్టేషనలో ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సోలార్ సిస్టమ్, వెయిటింగ్ రూమ్‌లు వంటి నిర్మాణలు చేపట్టారు.













