పాండ్యా హాఫ్ సెంచరీ.. రికార్డు బ్రేక్ చేసింది
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్ క్రిస్ట్ పేరుమీదున్న రికార్డును చెరిపేశాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి… రికార్డులకెక్కాడు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ఆట ప్రారంభం నుంచి తడబడుతూనే ఉంది. వరుసగా రోహిత్ శర్మ, కోహ్లీ, యువరాజ్, ధావన్, ధోనీ, జాదవ్ అవుటవుతున్నా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. ఒకానొక దశలో గెలుపు ఆశలు రేపాడు. అయితే దురదృష్టవశాత్తు.. 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు పాండ్యా. 1999 నాటి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై గిల్‌క్రిస్ట్ 33 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా ఉండేది. ఇప్పుడీ రికార్డును బద్దలు కొట్టాడు పాండ్య.













