తెలుగు సంగీత దర్శకుడు గిన్నిస్ రికార్డు
తెలుగు సినీ సంగీత దర్శకుడు వోగేటి నాగవెంకటరమణమూర్తి లాంగెస్ట్ మారథాన్ చర్చ్ ఆర్గాన్ ప్లేయింగ్ అంశంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. మేళకర్త 72 రాగాలను 63 గంటలపాటు తన సంగీత సాధనంపై వాయించి ఆయన ఈ ఘనత సాధించారు. లండన్‌లోని హ్యామర్స్మిత్లో యూకే కాలామానం ప్రకారం అక్టోబర్ 2న తేదీ రాత్రి పది గంటలకు తన ప్రయత్నంలో విజయం సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. గతంలో ఈ రికార్డు 60 గంటల ఒక నిమిషం, 25 సెకండ్లుగా ఉన్నది. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, అమెరికాకు చెందిన వెన్నం ఫౌండేషన్, తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వరనిధి సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.













