ధరలు పెరగవు – నిర్మలా సీతారామన్
వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభయమిచ్చారు. జిఎస్టి పరిధిలోకి వచ్చిన వస్తువులపై ప్రభుత్వం కొత్త పన్ను రేట్లేమీ విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ‘జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలేమీ పెరగవు. అన్నీ ఇంతకుముందు ఉన్నట్లుగానే ఉంటాయి. కనుక ఈ విషయమై అటు ప్రజలకు గానీ ఇటు వర్తకులకు గానీ ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు’ అని ఆమె పేర్కొన్నారు.













