త్వరలో రూ.20 నాణెం
దేశ ఆర్థిక వ్యవస్థలో తొలిసారి రూ.20 నాణెం చలామణిలోకి రానున్నది. ఈ మేరకు ప్రధాని మోదీ నూతన సిరిస్ రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను విడుదల చేశారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. దృష్టిలోపం గల వారూ గుర్తించేందుకు వీలుగా రూ.20 నాణేన్ని రూపొందించామన్నారు. 12 అంచులతో ఈ నాణాన్ని తయారు చేశారు. వ్యవసాయ రంగం ప్రాధాన్యాన్ని తెలిపేలా ఆహార ధాన్యాల డిజైన్‌తో దీన్ని రూపొందించారు. దీని బరువు 8.54 గ్రాములు. నికెల్, వెండి, జింక్, రాగి లోహాలతో బయటి రింగ్‌ను, లోపలి రింగ్‌ను తయారు చేశారు. అశోక చంక్రంపై సింహం చిహ్నాన్ని ఈ నాణెంపై ముద్రించారు. దిగువన సత్యమేవ జయతే అనే నినాదం ఉంటుంది.













