విమాన టికెట్‌కు డిజిటల్ గుర్తింపు తప్పనిసరి!
విమాన ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, పాస్‌పోర్టు లేదా పాన్ వంటి విశిష్ఠ గుర్తింపు వివరాలను అందించాలన్న నిబంధన 3-4 నెలల్లో అమల్లోకి వచ్చే వీలుంది. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. 30 రోజుల్లో ఈ కమిటీ ఒక శ్వేత పత్రాన్ని సిద్ధం చేస్తుందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. విశిష్ట గుర్తింపునకు అనేక మార్గాలు ఉన్నాయి. అత్యుత్తమ మార్గం, ఆధార్‌ను ఉపయోగించుకోవడం. పాస్‌పోర్టు లేదా పాన్ కార్డునూ ఉపయోగించుకోవచ్చు అని మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు కాగితరహిత, ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఈ డిజిటల్ వ్యవస్థను వద్దనుకునేవారికి ఎప్పటిలాగే బోర్డింగ్ పాస్‌లు ఇస్తారు.













