మరికొంత కాలం గవర్నర్‌గా నరసింహన్
గత ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా కొనసాగుతున్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను మరికొంత కాలం కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. పదవీకాలం ముగిసిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయన్నే కొనసాగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ అధికారులు ఆయనకు ఫోన్‌ద్వారా వర్తమానం పంపినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ గవర్నరుగా ఉన్న నరసింహన్‌కు అప్పటి యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబరు 27న ఆంధ్రప్రదేశ్ అదనపు బాధ్యతలు అప్పగించింది. 2010 జనవరి 23న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయి గవర్నరుగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలో సుదీర్ఘకాలంగా గవర్నరు పదవిలో కొనసాగుతున్న వారి జాబితాలో నరసింహన్ తొలిస్థానంలో ఉన్నారు.
2007 జనవరి 19 నుంచి (ఛత్తీస్‌గఢ్‌తో కలిపి) ఆయన గవర్నరు పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ గవర్నరుగా కొనసాగుతున్న ఎన్ఎన్ ఓహ్రా 2008 జూన్ 25 నుంచి ఆ పదవిలో ఉన్నారు. మిగత రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే సమయంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి గవర్నరుపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.













