మనోహర్ పారికర్ కు అరుదైన గౌరవం
ఢిల్లీ లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఢిఫిన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ (ఐడీఎన్ఏ)కి గోవా దివంగత సీఎం, కేంద్ర మాజీ రక్షణమంత్రి మనోహర్ పారికర్ పేరు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఐడీఎస్ఏను మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఢిఫిన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్గా వ్యవహరించనున్నారు. మనోహర్ పారికర్ సేవను గుర్తించి ఆయన గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. కాగా గత నెలలో ఈ బీజేపీ దిగ్గజానికి మరణానంతర పద్మ భూషన్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మనోహర్ పారికర్ గోవాకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. క్యాన్సర్తో సుదీర్ఘకాలం పాటు పోరాడిన ఆయన గతేడాది మార్చి 17న కన్నుమూశారు.













