సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి నియామకం
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా కోలీజియం ఇటీవల సిఫారసు చేసిన నలుగురి పేర్లను ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏఎస్ బొప్పన్న, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల పదోన్నతికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వారి నియామకాన్ని రాష్ట్రపతి కోవింద్ ఆమోదించాక నేడో రేపో నోటిఫికేషన్ వెలువడుతుందని ఆ వర్గాలు పేర్కొన్నారు. వీరు బాధ్యతలు చేపడితే సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో 31 మంది జడ్జిలు ఉంటారు. సీజేఐ రంజన్ గొగోయ్ 8 నెలల వ్యవధిలోనే సుప్రీంకోర్టులో 10 మంది జడ్జిలు నియమితులయ్యేలా చర్యలు తీసుకున్నారు.













