విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహాత్మ గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని విపక్ష పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇవాళ పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో 18 పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. గోపాలకృష్ణ గాంధీ పశ్చిమబెంగాల్ గవర్నర్గా పని చేసిన విషయం విదితమే. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదేరోజు ఫలితాల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ఆగస్టు 19తో ముగియనుంది.













