రూ.899కే గో ఎయిర్ టికెట్
దేశీయ మార్గాల్లో ప్రయాణానికి రూ.899 నుంచి ఆఫర్ టికెట్లు విక్రయించనున్నట్లు గో ఎయిర్ ప్రకటించింది. జూన్ 15 నుంచి డిసెంబరు 31 మధ్య ప్రయాణం కోసం అందుబాటులో ఉండేలా 10 లక్షల టికెట్లను ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు విక్రయిస్తామని తెలిపింది. కనీసం 2499 లావాదేవీకి పేటీఎం వాలెట్ ద్వారా చెల్లిస్తే రూ.500 నగదు వెనక్కి ఇస్తామని పేర్కొంది. కనీసం రూ.1999 లావాదేవీకి మిత్రా యాప్‌లో 10 శాతం రాయితీ లభిస్తుంది. జూమ్‌కార్ ద్వారా బుక్ చేసుకుంటే, రూ.1500 లేదా 20 శాతం రాయితీ లభిస్తుంది. ఫాబ్గోఎయిర్ కూపన్ కోడ్ వాడితే 40 శాతం వరకు రాయితీ, అదనంగా మరో 25 శాతం ధరలో తగ్గింపు ఉంటుందని వెల్లడించింది.













