రూ.312కే విమానయానం
చౌక ధరల విమానయాన సేవల సంస్థ గో ఎయిర్ పరిమితకాలానికి భారీ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి, బెంగళూరు, చెన్నైతో సహా 7 నగరాల నుంచి సంస్థ నడిపే విమాన సర్వీసుల వన్ వే టిక్కెట్ ధర కనిష్ఠంగా రూ.312 (పన్నులు అదనం) నుంచి మొదలవుతుందని తెలిపింది. ఈ నెల 24 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ నెల 29 వరకు అందుబాటులో ఉంటుందని, ఎవరు ముందు టిక్కెట్ బుక్ చేసుకుంటే వారికి ముందుగా సీట్ల కేటాయింపు జరపనున్నట్లు గో ఎయిర్ సృష్టం చేసింది. ఈ ఆఫర్లో బుక్ చేసుకునే టిక్కెట్ల ద్వారా వచ్చే నెల 1 నుంచి వచ్చే అక్టోబరు 28 మధ్యలో ప్రయాణం చేయవచ్చు.













