అంతర్జాతీయ రూట్లలో గో ఎయిర్
చౌక విమానయాన సంస్థ గో ఎయిర్.. మరో ఏడు అంతర్జాతీయ రూట్లకు విమాన సర్వీసులు అందించనున్నట్లు ప్రకటించింది. వీటిలో మూడు కొత్త దేశాలైన బ్యాంకాక్, దుబాయి, కువైట్లతో పాటు మరో నాలుగు ఇతర రూట్లకు సర్వీసులను 19న ప్రారంభించబోతున్నది. ఇందుకు నియంత్రన మండలి డీజీసీఏ కూడా అనుమతించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముంబై, న్యూఢిల్లీ, కన్నూరుల నుంచి అబుదాబి, దుబాయి, మస్కట్, బ్యాంకాక్‌లకు రోజువారి సర్వీసులను నడుపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే అబుదాబి, మస్కట్లకు కన్నూరుల నుంచి విమాన సర్వీసులు అందిస్తుండగా, నూతనంగా బ్యాంకాక్, దుబాయి, కువైట్లకు నడుపబోతున్నది. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ నూతన సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు గో ఎయిర్ ఎండీ, సీఈవో జే వాడియా తెలిపారు. ప్రస్తుతం సంస్థ హైదరాబాద్‌లో పాటు, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, ఇతర నగరాలకు విమాన సేవలు అందిస్తున్నది.













