అమెరికాకు మనోహర్ పారికర్
నాలుగు రోజుల నుంచి గోవా మఖ్యమంత్రి మనోహర్ పారికర్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకుంటున్నారని సదరు ఆసుపత్రి కూడా ప్రకటించింది. కాగా, బీజేపీ నేత, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో తాజాగా మీడియాతో మాట్లాడుతూ, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం పారికర్‌ను అమెరికాకు తరలిస్తామని తెలిపారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, మనోహర్ పారికర్ ప్యాంక్రియాస్ సమస్య ఏర్పడిన కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందంటూ వచ్చిన వార్తలను బీజేపీ నేతలు ఖండించారు.













