ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడడమే నా కల
యడ్యూరప్పను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడడమే తన కల అని మైనింగ్ వ్యాపారి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్నాటకలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు ఎలాంటి బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. అక్రమ మైనింగ్ కేసులో మూడేళ్ళు జైలులో గడిపిన గాలి గత ఏడాది బెయిల్పై విడుదలయ్యారు.













