పాన్‌కు ఆధార్ తప్పనిసరి
పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగా మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఆదాయ పన్ను శాఖ ఇ-పై లింగ్ వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు, పాన్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డు నంబర్ లేదా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసినపుడు కేటాయించిన గుర్తింపు నంబర్ అయినా పేర్కొనాలి. జూలై 1 నుంచి ఆదాయ పన్ను రిటర్న్‌లు ఫైల్ చేసేందుకూ పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలని ఐటీ శాఖ ఇప్పటికే సృష్టం చేసింది. పాన్ కార్డుల జారీ, ఐటిఆర్ల ఫైలింగ్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఐటి చట్టంలో చేసిన మార్పులను సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది. దీంతో జూలై 1 నుంచి పాన్ నంబర్ కోసం చేసే దరఖాస్తుల్లోనూ ఆధార్ నంబర్ పేర్కొనాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.













