ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : దేవేగౌడ
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదానిచ్చి, రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరించాల్సిందేనని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ్ సృష్టీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో టీడీపీ, వైకాపా ల అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా కేంద్రమే వ్యూహాత్మకంగా అడ్డుకుంటోందన్న ఆరోపణల్ని ప్రస్తావించినప్పుడు అది జరిగి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సమయమింకా రాలేదన్నారు. ఒకవేళ అది చర్చకు వచ్చినపుడు తమ అభిప్రాయాన్ని చెప్పానన్నారు.













