హైదరాబాద్ నుంచి వాషింగ్టన్కు విమాన సర్వీసు
హైదరాబాద్, ఢిల్లీ మీదుగా వాషింగ్టన్కు నేరుగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టినట్టు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. ఎంపీ వినోద్‌కుమార్ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధనం ఇస్తూ, హైదరాబాద్-ఢిల్లీ- వాషింగ్టన్-ఢిల్లీ -హైదరాబాద్ రూట్లో ఈ నెల 7 నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ఎయిర్ఇండియా విమాన సర్వీసును ప్రారంభించినట్టు తెలిపారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్, హోస్టన్లకు విమానాలను నడిపే ఉద్దేశం ఉన్నదా అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. అవసరాన్ని బట్టి సర్వీసులను ప్రారంభిస్తామని మంత్రి బదులిచ్చారు. ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.













