కాంగ్రెస్ పార్టీకి ఫేస్ బుక్ షాక్
ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఫేస్బుక్ సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. నకిలీ ఖాతాలను, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కాంగ్రెస్ ఐటీ విభాగం లోని వ్యక్తులకు సంబంధించిన 687 పేజీలను, కొన్ని ఖాతాలను తొలిగించినట్టు ఫేస్బుక్ ప్రకటించింది. అనుమానాస్పదంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని, తప్పుడు అకౌంట్లతో నెట్వర్క్గా ఏర్పడి గుర్తింపునకు దొరక్కుండా, వాటి వెనుక ఎవరున్నారో తెలియకుండా అనుచితంగా వ్యవహరిస్తుండటం వల్లనే వీటిని తొలిగించామని ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ విభాగ అధిపతి నతాని యేల్ గ్లెయిచెర్ తెలిపారు.













