సీబీఐ మాజీ జేెడీ సంచలన నిర్ణయం
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ జేడీ, మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ ఆఫ్ జనరల్ (ఏడీజీపీ) వి.వి.లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈయన సర్వీసు మరో ఏడేళ్లు ఉన్నప్పటికీ ఈ ముందస్తు నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వీఆర్ఎస్కు అనుమతి కోరుతూ మహారాష్ట్ర డీజీపీకీ దరఖాస్తు చేసుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులు, ఓబులాపురం మైనింగ్ కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటి సంచలనాత్మకమైన కేసులు దర్యాప్తు చేసిన ఆయన ప్రస్తుతం సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే ఉద్దేశంతోనే లక్ష్మీనారాయణ ముందస్తు రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.













