బెంగాల్ ప్రజలకు మమత కానుక
అంతర్జాతీయ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలకు ఓ కానుకను అందజేశారు. రాష్ట్రంలోని ప్రజలకు ఖాద్య సౌథీ పథకం వర్తించేలా చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని 8.5 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత పథకం కింద ఈ పథకాన్ని అమలు చేస్తామని మమత తెలిపారు. జంగల్ మహల, కొండ, ఐలా తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు, సింగూర్ రైతులు, టీ తోటలలో పని చేసే కార్మికులు, టోటోతెగ వారు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని ఆమె వివరించారు. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండటానికే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు ఆమె తెలిపారు.













