జర్నలిస్టుల పై దాడులు, కేంద్రం సీరియస్, రాష్ర్టాలకు ఆదేశాలు
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే పత్రికారంగం మరియు మీడియా భద్రత తమకు ముఖ్యమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తంచేసిన ఈ శాఖ, అన్నిరాష్ర్టాలు దీనిపై దృష్టి పెట్టాలని పాత్రికేయుల మీద దాడులు చేస్తే క్రిమినల్స్‌ని కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
జర్నలిస్టులపై ఎటాక్ లకు సంబంధించి అన్ని కేసులను త్వరితగతిన విచారించాలని ఇందుకు కాలపరిమితి నిర్ధేశించుకోవాలని కోరింది. 2010-2017ల మధ్య ఇందుకు సంబంధించి జారీచేసిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, మీడియాకు గల భావ ప్రకటన స్వేచ్ఛను హరించరాదని పేర్కొంది. రీసెంట్గా బెంగుళూరులో గౌరీలంకేష్, అగర్తలాలో షంతనుభౌమిక్ దారుణ హత్యలను కేంద్రం ప్రస్తావించింది…













