దేశవ్యాప్తంగా ఏడువిడతలలో సార్వత్రిక ఎన్నికలు
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలో మొత్తం ఏడువిడతలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడత ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 18న రెండవ విడత, ఏప్రిల్ 23న మూడవ విడత, ఏప్రిల్ 29న నాల్గవ విడత, మే 6న ఐదవ విడత, మే 12న ఆరవ విడత, మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. మే 23న దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 175, ఒడిశాలో 147, అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.













