సముద్రపు ఆహారంతో జాగ్రత్త!
సముద్రపు ఆహారంతో జాగ్రత్త. రొయ్యలు, పీతలు సహా డెక్కలు మెత్తగా ఉండే సముద్రపు జీవులు కలరాకు కారణమయ్యే ముప్పుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. వ్యాధికారక బ్యాక్టీరియా విబ్రోకలరే కలుషిత నీటిలో నివాసముండే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది సముద్రపు జీవులపై, వాటి పేగుల్లోనూ చక్కగా మనుగడ సాధించగలదని పరిశోధకులు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా సోకిన జీవులను వారు నాలుగు రోజులపాటు ఫాస్ఫేట్ కలిపిన ఉప్పునీటిలో ఉంచారు. ప్రతి 24 గంటలకూ వాటిని జాగ్రత్తగా పరిశీలించారు. దీంతో వాటిలో బ్యాక్టీరియా స్థాయిలు ఏ మాత్రం తగ్గడంలేదని వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా రెక్కలు, మెడ, ఉదర భాగాల్లో పెద్దయెత్తున బ్యాక్టీరియా పేరుకున్నట్లు తెలిపింది.













