కరోనాపై సమరంలో ముగ్గురు మహిళల కీలకమైన పాత్ర
అగ్రదేశాల వెన్ను విరిచిన కరోనా భారతదేశంలో తలవంచడానికి ముగ్గురు మహిళా అధికారులు కీలకమైన పాత్ర పోషించారు. గత రెండు నెలల నుండి ఆఫీసు లోనే నివాసముంటూ, కుటుంబాలను కూడా కలవలేకపోయిన ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమయ్యారు. వీరే ప్రీతి సుడాన్, డాక్టర్ నివేదిత గుప్త, సైంటిస్ట్ రేణు స్వరూప్.
ప్రీతి సుడాన్
కేంద్ర హెల్త్ సెక్రటరీగా ప్రీతి సుడాన్పని చేస్తున్నారు. ఆంధప్రదేశ్ కు చెందిన ఈ ఐఎఎస్ ఆఫీసర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ఇప్పుడు కరోనా యుద్ధంలో నరేంద్ర మోడీతో కలిసి ప్రత్యక్షంగా పని చేస్తూ మన్ననలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు.
డాక్టర్ నివేదిత గుప్త
ఎంబిబిఎస్ చదివిన నివేదిత గుప్త మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో ఈమె చేసిన కృషిని ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రపంచ దేశాలను ఆమె సమన్వయం చేస్తున్నారు.
సైంటిస్ట్ రేణు స్వరూప్
జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్డీ చేసిన రేణు స్వరూప్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని శాస్త్ర సలహాదారుల కమిటీలో సేవలందిస్తున్నారు. కరోనాపై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. 2001, 2007, 2015లో ఆమె రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు ప్రశంసలు పొందాయి.
వీరే కాకుండా ఆంధప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు అధికారులు కూడా కరోనా సమరంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో మొదటి వారు లవ్ అగర్వాల్. ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ సాధించిన ఈ లవ్ అగర్వాల్ 48 ఏళ్ల యోగా నిపుణుడు. విశాఖ జిల్లా కలెక్టర్ గా, ఆంధప్రదేశ్ హెల్త్ కమీషనర్ గా పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రతి రోజు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తున్నారు. అనేక వినూత్న ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఆదర్శమవుతున్నారు. మొబైల్ ఫోన్ల కరోనా కాలర్ ట్యూన్, కంటైన్మెంట్ స్ట్రాటజీ, సోషల్ డిస్టెన్సింగ్ నార్మస్, క్లస్టర్ ఔట్ బ్రేక్ స్ట్రాటజీలు ఈయన రూపొందించినవే.
మరో వ్యక్తి డాక్టర్ జితేంద్ శర్మ. సత్య సాయిబాబాకు అత్యంత విశ్వాసపాత్రుడు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గా పని చేసిన ఈయన ఏపీ రాజకీయ కక్షలకు బలైన సంగతి తెలిసిందే. విషయం ఢిల్లీ వరకు వెళ్ళగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా కలుగజేసుకుని ఈయనను మళ్ళీ ఏపీ మెడ్ టెక్ ఎం.డీ గా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అధిపతిగా నియమించారు. ఈయన పని ప్రారంభించిన కొద్ది రోజులలోనే దేశంలోనే మొట్టమొదటిగా రాపిడ్ టస్ట్ కిట్స్ ను తయారు చేయిస్తున్నారు. ఇవి కేవలం యాభై నిముషాలలో కరోనాను నిర్ధారిస్తాయి. ప్రస్తుతం రోజుకు రెండు వేల కిట్లు తయారవుతుండగా వచ్చే వారానికి ఇది ఇరవై ఐదు వేలకు చేరుతుందని అంచనా. మార్చి 31నాటికి ఆంధప్రదేశ్ మొత్తంలో కేవలం 148 వెంటిలేటర్లు ఉండగా, జితేంద్ర శర్మ నేతృత్వంలో నెలకు మూడు వేల వెంటిలేటర్లు తయారుచేయడానికి కృషి జరుగుతోంది. దీనితో ఆసియా మొత్తానికి ఈయన కృషి ఫలితాలు అందనున్నాయి.
వీరు చేస్తున్న కృషి వల్లే భారత్లో కరోనా కట్టడి సాధ్యమైందని మృతుల సంఖ్యను బాగా తగ్గించగలిగారని అంటున్నారు. లేకుంటే అమెరికా, ఇటలీలాగా భారత్లో కూడా శవాల గుట్టలు కనిపించేవని పేర్కొంటున్నారు.
(సోషల్ మీడియా సహకారంతో)













