పెట్రోలు ధరల పెరుగుదలకు అమెరికాయే కారణం
అమెరికా అనుసరిస్తున్న ఒంటిరితన విధానాల వల్లనే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం ధరలు విపరీతంగా పెరిగాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ల ధరలు నిరంతరాయంగా పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళనతో ఉందని అన్నారు. వాటిని అదుపుచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా అనుసరిస్తున్న ఏకాకి విధానాలు కారణంగా డాలరుతో పొల్చితే ప్రపంచంలోనేని అన్ని దేశాల ద్రవ్యాల విలువలు తగ్గాయి. అందువల్లనే రూపాయి విలువ కూడా పడిపోయింది. ఇంధనం ధరలు విపరీతంగా పెరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న ఈ రెండు అంశాలూ (పెట్రో ధరలు అదుపులేకుండా పెరగడం, రూపాయి విలువ పడిపోవడం) విదేశీ కారణాలని వివరించారు.













