ఢిల్లీ లో ఆప్ ఘన విజయం
దేశ రాజధాని హస్తినలో ముచ్చటగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పాగా వేసింది. ఢిల్లీ పీఠంపై మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఆసీనులు కానున్నారు. ఇప్పటికె రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవందించిన కేజ్రీవాల్.. మూడోసారి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాను మించి ఆప్ దూసుకెళ్లింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఆప్ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 36 కాగా, 63 స్థానాల్లో ఆప్ ఘన విజయం సాధించింది. 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాకు గానూ ఆప్ 67 స్థానాలను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా 2015 ఫలితాలే పునరావృతమయ్యాయి. గతంలో షీలాదీక్షిత్ నేతృత్వంలో వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవకుండా చతికిపడిరది.













