దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న మైసూర్
మైసూర్ అంటేనే దసరా ఉత్సవాలు గుర్తుకువస్తాయి. దసరా పండుగ దగ్గర పడగానే మైసూర్ వైపు వెళ్లాలనిపిస్తోంది. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు స్వరం సిద్ధమైంది. ఏనుగు అంబారీలను సిద్దం చేస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం తనవంతుగా ఉత్సవాలకు ఊతమిస్తోంది. రెండేళ్ల కరువు ఆర్థిక వనరులను దెబ్బతీసిన తర్వాత ఈ ఏడాది ఆశాజకమైన వాతావరణంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి పదిరోజుల పాట నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చెరుకున్నాయి. మైసూర్ దసరా ఉత్సవాలు అంటే ఓ తిరునాళ్లు, ఒక సాంస్కృతిక వారసత్వం. జనమందరినీ ఏకంచేసే ఉత్సవం. ప్రజలందరూ ఓక్కటై జరుపుకునే పండుగ. ఆటపాటలు, కవిసమ్మేళనాలు, మళ్ల యుద్ధపోటీలు, చివరకు ఏనుగు అంబారీలు ఒక్కటేమిటి ఈ ఉత్సవాలకు అన్ని ప్రధాన ఆకర్షణాలే వీటి ఏర్పాట్లు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.













