బస్సుకు వేపతోరణం కట్టిన గ్రామస్తులు
కరోనా వైరస్ను తరిమి కొట్టేందుకు కోయంబత్తూరు గాంధీపురం గ్రామస్తులు తమదైన శైలిలో సిద్ధమయ్యారు. తమగ్రామానికి వచ్చే ఒక్కగానొక్క బస్సులో సురక్షిత ప్రయాణానికి తగ్గ ఏర్పాటు చేసుకున్నారు. బస్సును వేప ఆకుల తోరణాలతో ముంచెత్తారు. పసుపు నీళ్లు చల్లి, నిమ్మకాయల మాలవేసి మరీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా కల్లోలం స•ష్టిస్తున్న నేపథ్యంలో జనంలో ఆందోళన రెట్టింపవుతోంది. నగర వాసుల్లోనే కాదు, కుగ్రామాల్లోని ప్రజలను ఈ వైరస్ వణికిస్తోంది. మరోవైపు వైరస్ను తరిమి కొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోలో కోయంబత్తూరు శివారులో కేరళ సరిహద్దుల్లో ఉన్న కుగ్రామం గాంధీపురం వాసులు మరింత అప్రమత్తమయ్యారు. పాతకాలపు పద్ధతులు అంటూ, అమ్మ వారు వచ్చినప్పుడు, గాలి సోకినా, గ్రామాల్లో ఏదేని రుగ్మతులు సోకినప్పుడు ఏ విధంగా ఆచరిస్తారో అదే తరహాలో ముందుకు సాగారు. బస్సుకువేప తోరణం కట్టారు. లోపల నిమ్మకాయలు పిండి పూజ చేశారు.













