బాబ్రీ కేసులో బీజేపీ నేతలకు ఊరట
బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భారతికి ఊరట లభించింది. కేసు విచారణకు వ్యక్తిగత హజరు నుంచి వారికి లఖ్వన్ సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణకు వారి తరపున న్యాయవాదులు హాజరైతే చాలని సృష్టం చేసింది. అడ్వానీ తదితర సీనియర్ నేతలతపోటు 12 మంది ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గత నెల 30న ఈ కేసుకు సంబంధించి బీజేపీ అగ్రనేతలకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే వారిపై కేసు నమోదు చేయొద్దని దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను మాత్రం తిరస్కరించింది. ఈ కేసులో అడ్వాణీ సహా బీజేపీ నేతలపై కేసు నమోదు చేయాల్సిందేనని సృష్టం చేసింది.













