కరోనా సంక్షోభం మనకు పెద్ద సవాల్ – రాహుల్ గాంధీ
కోరనా సంక్షోభం మనకు పెద్ద సవాల్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో తలెత్తిన పరిస్థితులను అవకాశంగా తీసుకుని సంక్షోభాలను ఎదుర్కొనేందుకు వినూత్న ఆవిష్కరణలకు నాంది పలకాలని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభ సమయంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డేటా నిపుణులను పెద్ద ఎత్తున సమీకరించి వినూత్న పరిష్కారాలు కనుక్కోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ మహమ్మారిపై ఐక్యంగా పోరాడాలని అంతకుముందు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో లాక్డౌన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.













