కరోనా కమ్యునిటీ ట్రాన్సిమిషన్ జరగలేదు…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో భారత్‌లో ఇంకా కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ జరగలేదని ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శనివారం తెలిపింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో దాదాపు పది శాతం మందికి తీవ్రవైన శ్వాససంబంధ సమస్య ఉన్నట్లు తెలిపింది. కరోనా లక్షణాలతో ఇప్పటివరకు హాస్పిటల్లో చేరిన 110 మందిలో దాదాపు పదకొండు మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే వారిలో చెన్నై, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురికి ఎలాంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేదు. కరోనా సోకిన వ్యక్తితోనూ వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇక కమ్యునిటీ ట్రాన్స్మిషన్ అనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు.’అని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త గంగాఖేద్కర్ అన్నారు. ఇప్పటివరకు 150 ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా సెల్ఫ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచితే, ప్రజలు ఎవరికివారు సరైన మార్గదర్శకాలు లేకుండా వాటిని వినియోగిస్తారని, దాని వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా డాక్టర్ల అనుమతి లేకుండా సొంత నిర్ణయాలతో మందులు వాడటం మంచిది కాదని చెప్పారు.













