కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్‌తో జనంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరు తుమ్మినా, దగ్గినా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణ జలుబు చేసినా కరోనా సోకిందేమోనన్నా భయం ప్రజలను వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు కరోనా టెస్ట్ చేసుకోవాలనే దానిపై కేంద్రవైరోగ్యశాఖ కొన్ని సూచనలు చేసింది.
ముఖ్యంగా పరీక్షలు ఎవరెవరూ చేసుకోవాలంటే…
– గడిచిన 14 రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వారు, విదేశాల్లో ప్రయాణం చేసినవారు పరీక్షలు చేయించుకోవాలి.
– కరోనా పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన, తిరిగిన వారు కూడా తప్పని సరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.
– వైద్యరంగంలో పనిచేస్తున్న వారందరూ కూడా టెస్ట్ చేసుకోవాలి.
-ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన, పొందుతున్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిందే.
-శ్వాసకోస సంబంధ వ్యాధులు, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారందరూ తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.













