కరోనా చికిత్సలో కేరళ మరో ముందడుగు
కోవిడ్- 19 కు ఇంకా వ్యాక్సిన్ తయారుచేయకపోవడంతో భారత్, యూఎస్ లాంటి దేశాల్లోని నిపుణులు కరోనా చికిత్స కోసం కోలుకున్న వారి రక్తాన్ని వాడడానికి అనుమతి తీసుకున్నారు. తాజాగా కేరళ మరో అడుగు ముందుకేసింది. ప్లాస్మా థెరపీని కోవిడ్- 19 చికిత్స కోసం వాడేందుకు ఐసీఎంఆర్ అనుమతి పొందింది. దీన్ని కేరళ ప్రిన్సిపాల్ సెక్రటరీ ధ•వీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. కేరళలోనే భారత్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగాత్మక థెరపీని నిర్వహించనున్నట్లు టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ తెలిపినట్లు వెల్లడించింది. వారు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ’’ ప్రతికూల పరిస్థితుల్లో ఈ ప్రయోగం విజయవంతమవుతుందని వారు ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రసరణ ప్లాస్మా చికిత్సలో రోగులకు ప్లాస్మా ఇవ్వడం ద్వారా వారి వ్యాధినిరోధక శక్తిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తాం’’ అని తెలిపారు.













