రాజ్యసభకు ప్రియాంక ?
కేంద్రంలోని అధికార బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం సరికొత్త వ్యూహాలు రచిస్తున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్టు వార్తు వస్తున్నాయి. ఇప్పటికే లోక్సభలో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శ దాడి చేస్తూండగా, రాజ్యసభలో ప్రియాంక గాంధీ అయితే బీజేపీని మరింత ఇరకాటంలో పెట్టవచ్చని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. బీజేపీని పార్లమెంటు ఉభయ సభల్లో సమర్థవంతంగా ఎదుర్కోవాంటే రెండు వైపులా పదునున్న కత్తి అవసరమని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపాని అక్కడి కాంగ్రెస్ నేతలు అధిష్ఠానాన్ని కోరుతున్నారు. అయితే, ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.













