ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడును ఎంపిక చేయడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం
ఉప రాష్ట్రపతిగా ఎం.వెంకయ్య నాయుడును బీజెపీ జాతీయ పార్టీ ఎంపిక చేయడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ప్రకటించగానే న్యూఢిల్లీలోని ఆయనను కలిసి దత్తాత్రేయ శాలువా కప్పి, సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అలుపెరుగని కృషిచేసిన నాయకుడని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని దత్త్తాత్రేయ వ్యాఖ్యానించారు.













