ఈ నెల 26న ఎన్నారైల వివాహ సంబంధ కేసులపై సదస్సు
ఎన్నారైల వివాహ సంబంధ కేసులపై ఈ నెల 26న జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏటా 20కిపైగా ఎన్ఆర్ఐ వివాహ కేసులు నమోదవుతున్నాయన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని విదేశీ చట్టాల ప్రకారం విడాకులు ఇవ్వడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పెళ్లికి ముదే అగ్రిమెంట్ రూపంలో హామీ తీసుకోవాలన్నారు. 26న జరిగే సదస్సులో పరిష్కార మార్గాలను ఆలోచిస్తామని తెలిపారు.













