మూడోదశకు కరోనా వచ్చింది: ఎయిమ్స్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు వైరస్ సోకి మ•తి చెందిన వారి సం•్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పలు కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ రెండో దశను దాటి మూడో దశకు చేరుకుందని ప్రకటించారు. అయితే మూడో దశ దేశ వ్యాప్తంగా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే ఉందని తెలిపారు. పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ (లోకల్ కాంటాక్ట్) ద్వారా వైరస్ సోకడాన్ని గుర్తించాం. దీనిని వైరస్ మూడోదశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశ దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే విస్తరించింది. దేశ వ్యాప్తంగా అత్యధిక భాగం కేవలం రెండోదశలో ఉండంటం కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే మూడోదశ అనేది మన దేశంలో ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉంది. దానిని అదుపుచేయడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నాం. దానిని ఎంత త్వరగా అరికడితే అంతమంచిదని చెప్పారు.













