సీఎం చంద్రబాబు లండన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం లండన్ చేరుకుంది. యూఏఈలో మూడు రోజుల పర్యటనను ముగించుకొని చంద్రబాబు దుబాయ్ నుంచి లండన్‌కు చేరుకున్నారు. లండన్‌లో రవాణా వ్యవస్థను చంద్రబాబు పరిశీలించనున్నారు. అమరావతిలో నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించి నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ రూపొందించిన తుది ఆకృతులను పరిశీలించనున్నారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, పెట్టుబడిదారులతో జరిగే సమావేశాల్లో పాల్గొనున్నారు. గోల్డెన్ పీకాక్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరై అవార్డును అందుకోనున్నారు.













