స్వచ్ఛత సర్వేలో తెలుగు రాష్ట్రాలు
దేశ వ్యాప్తంగా స్వచ్ఛతా ప్రమాణాలను పాటిస్తున్న స్టేషన్లలో విశాఖటప్నం, సికింద్రాబాద్ స్టేషన్లు మొదటి రెండు ర్యాంకుల్లో నిలిచాయి. దేశ వ్యాప్తంగా ఇరవై స్టేషన్లలో తెలుగురాష్ట్రాల్లోని ఈ రెండు స్టేషన్లకు ర్యాంకులు లభించడం విశేషం. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో దేశ వ్యాప్తంగా ఎ1 స్టేషన్లలో 20 పరిశుభ్రత స్టేషన్లను ప్రకటించారు. అందులో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉండగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ స్టేషన్ రెండస్థానం, విజయవాడకు నాలుగవ ర్యాంకు, కాచిగూడ స్టేషన్‌కు 11ర్యాంకు, హైదరాబాద్ స్టేషన్‌కు 16వ ర్యాంకు, తిరుపతి స్టేషన్‌కు 19 ర్యాంకు దక్కింది. ఏ క్యాటగిరిలో ఖమ్మం స్టేషన్‌కు దేశవ్యాప్తంగా రెండ ర్యాంకు, మంచిర్యాల ఐదవ ర్యాంకు, వరంగల్‌కు 8వ ర్యాంకు, ఖాజీపేట 17వ ర్యాంకు, చీరాల, నిజామాబాద్‌లో 25, 26 ర్యాంకులు లభించాయి.













