తదుపరి సీజేఐగా జస్టిస్ బాబ్డే!
భారత సర్వోన్నత న్యాయస్థానం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేను ప్రస్తుత సీజేఐ ప్రభుత్వానికి సిఫారసు చేశార. సీజేఐ రంజన్ గొగొయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. సీనియారిటీలో జస్టిస్ రంజన్ తర్వాత ఎస్ఏ బాబ్డే ఉన్నారు. సాంప్రదాయం ప్రకారం తన తదుపరి వారసుడిని ప్రస్తుత సీజేఐ ప్రతిపాదించాలి. దీంతో ఎస్ఏ బాబ్డేను సీజేఐగా నియమించే చర్యలను ప్రారంభించాల్సిందిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రంజన్ గొగొయ్ కోరారు. బాబ్డే 24 ఏప్రిల్, 1956న నాగ్‌పూర్‌లో జన్మించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఛాన్సలర్‌గా సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.













