సుప్రీం గగోయ్ అరుదైన రికార్డు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన 8 నెలల కాలంలోనే సుమారు పది మంది న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు నియమించారు. అంతేకాకుండా పది మంది న్యాయమూర్తుల చేత ప్రమాణం చేయించారు. అంతకు ముందు పనిచేసిన చీఫ్ జస్టిస్‌లు అందరిలోకెల్లా గగోయ్ ఈ ఘనతను సాధించారు. ఇటీవల దశాబ్దకాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను భర్తీ చేసుకోలేకపోయింది. ఆ ఘనతను సైతం సుప్రీం చీఫ్ జస్టిస్ సాధించారు. గగోయ్ గత ఏడాది అక్టోబరు 3వ తేదీ చీఫ్ జస్టిస్‌గా ప్రమాణం చేసారు. మొదటిసారిగా కొలిజియంకు మొదటి సెట్ సిఫారసులను గత ఏడాది అక్టోబరు 30వ తేదీ పంపించారు. 48 గంటల్లోనే ప్రభుత్వం హేమంత్‌గుప్తా, సుభాష్‌రెడ్డి, ఎంఆర్‌షా, అజయ్ రస్తోగిలు నియమించింది.













