విమాన ప్రయాణికులకు శుభవార్త
విమాన ప్రయాణికులకు శుభవార్త. మీరు ప్రయాణించనున్న విమాన సర్వీసు రద్దు అయినా, విమానం రాకపోకల్లో జాప్యం జరిగినా, మీ సామాను పోయినా, దెబ్బతిన్నా ప్రయాణికులకు అధిక నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా ప్రతిపాదించింది. అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో సామగ్రి పోయినా, దెబ్బతిన్న కిలోకు మూడువేల రుపాయలు ప్రస్థుతం చెల్లిస్తున్నారు. కాని దెబ్బతిన్న సామాన్ల కోసం పరిహారాన్ని 20 వేల నుంచి లక్షరూపాయల వరకు పెంచాలని విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. విమానం మిస్ అయినా, లేక పోరపాటున బోర్డింగును తిరస్కరించినా ప్రయాణికులకు రూ.3,000 నుంచి 20 వేల రూపాయల వరకు పరిహారం చెల్లించాలని విమానయాన మంత్రిత్వశాఖలో ఉన్న నిబంధనలు మార్చాలని అధికారులు నిర్ణయించారు.













