చైనా వక్రబుద్ధి
డోక్లామ్ వివాదానికి తెరపడినట్లు అందరూ భావిస్తున్న తరుణంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత సైన్యాలు మాత్రమే వెనక్కి వెళ్లిపోయాయని అక్కడ తమ గస్తీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు డోక్లామ్లో రోడ్డు నిర్మాణాన్ని ఆపి వేయడంపై కూడా దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ‘సరిహద్దులను కాపాడడానికి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి చైనా చాలాకాలంగా రోడ్డు నిర్మాణంతోపాటుగా వౌలిక సదుపాయాలను మెరుగుపర్చడాన్ని కొనసాగిస్తూ ఉంది’ అని చైనా విదేవాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు.













